Andhra Pradesh IT Minister and Chandrababu Naidu’s son Nara Lokesh on Friday announced the assets of the chief minister and his family for the seventh consecutive year. Asper Lokesh’s claims, with Rs 2.53 crore, Chandrababu Naidu is the poorest in the family.
ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ శుక్రవారం తమ కుటుంబ సభ్యుల ఆస్తులను ప్రకటించారు. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఆస్తుల ప్రకటన అంతా బూటకమని ఆ పార్టీ ఏంపీ మిథున్ రెడ్డి విమర్శించారు. మీ ఆస్తుల వివరాలు ఎవరూ అడగడం లేదని కౌంటర్ ఇచ్చారు.లోకేష్ ప్రకటించిన ఆస్తుల కంటే రెండు రెట్లు ఇచ్చి కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అవసరమైతే చందాలు వేసుకొని మరీ లోకేష్ ఆస్తులు కొంటామని, వాటిని ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఇస్తామని చెప్పారు. ఈ సవాల్‌కు లోకేష్ సిద్ధమా అని నిలదీశారు.ఎవరూ అడగకపోయినా నారా కుటుంబం ఆస్తులు ప్రకటిస్తూ డ్రామాలు ఆడుతోందని వైసీపీ అధినేత వైయస్ జగన్ పత్రిక సాక్షి పేర్కొంది. వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను వంద కోట్ల లోపే చూపిస్తూ, పైగా మార్కెట్ విలువ అంటూ కలరింగ్ ఇచ్చే ప్రయత్నం లోకేష్ చేశారని పేర్కొంది.